అక్షరటుడే వెబ్‌డెస్క్: FSSAI Misleading Claims | ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీల తీరుపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) కన్నెర్ర చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు (Misleading Claims) చేస్తున్న ప్రముఖ బ్రాండ్లపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ‘లోట్టే ఇండియా’ (Lotte India), ‘కుబేర ఫుడ్స్’ (Kuberra Foods) వంటి దిగ్గజ సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, ఏడు రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని ఆయా కంపెనీలను ఆదేశించింది.
FSSAI Misleading Claims | లోట్టే ఇండియా (Lotte India)..
వీరి ‘చోకో పై’పై ‘100 శాతం వెజిటేరియన్’ అని తప్పుడు క్లెయిమ్స్ చేస్తున్నట్లు FSSAI గుర్తించింది. అలాగే, ‘ఫ్రూట్జ్ ఎక్లైర్స్’లో అసలు పండ్ల కంటెంట్ లేకపోయినా, పండ్ల పేరుతో అమ్మడం, ‘రోస్టెడ్ ఆల్మండ్’ చాక్లెట్లలో తక్కువ నాణ్యత గల హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ వాడుతూ.. వాటిని ‘ప్రీమియం’ అని మార్కెటింగ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
FSSAI Misleading Claims | కుబేర ఫుడ్స్ (Kuberra Foods)..
వీరి ‘క్రీమ్ బన్’ ప్యాకెట్లపై “100 శాతం నేచురల్, నో ప్రిజర్వేటివ్స్” అని పెద్ద అక్షరాలతో ముద్రించారు. కానీ, లోపల ఉన్న లేబుల్స్ పరిశీలిస్తే.. అందులో సింథటిక్ రంగులు, ప్రిజర్వేటివ్స్, కృత్రిమ ఫ్లేవర్లు ఉన్నట్లు తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.
FSSAI Misleading Claims | వినియోగదారులకు హెచ్చరిక..
ప్రతి సంస్థ తమ ఉత్పత్తుల గురించి కస్టమర్లకు నిజాయితీగా, స్పష్టమైన సమాచారాన్ని అందించాలని FSSAI స్పష్టం చేసింది. తప్పుడు ప్రకటనలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే.. ఎంతటి పెద్ద బ్రాండయినా సరే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Suryapet Congress Clash | సూర్యాపేట జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు.. ఎంపీ వర్గంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి