అక్షరటుడే, వెబ్డెస్క్: Suryapet Congress Clash | కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District)లో పలువురు నేతల మధ్య విబేధాలు ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య పొసగడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఎంపీ వర్గంపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం కలకలం సృష్టించింది.
సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. తుంగతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేలు ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు బుధవారం ఉదయం గాంధీ భవన్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన పలువురు వారిని అర్వపల్లి వద్ద అడ్డుకున్నారు. వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి చేశారు.
Suryapet Congress Clash | తీవ్ర ఉద్రిక్తత
సొంత పార్టీ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు దాడి చేయడంతో అర్వపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడిలో కాంగ్రెస్ నాయకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. దీంతో గొడవ ఆపడానికి పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి..: Warangal Bhadrakali Temple | వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత