తెలంగాణRTC Strike | రేవంత్ సర్కార్‌కు బీఆర్ఎస్ హెచ్చరిక.. మరో 'సకల జనుల సమ్మె' తప్పదా?

RTC Strike | రేవంత్ సర్కార్‌కు బీఆర్ఎస్ హెచ్చరిక.. మరో ‘సకల జనుల సమ్మె’ తప్పదా?

తెలంగాణలోని ఆర్టీసీ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అక్షరటుడే,హైదరాబాద్: RTC Strike | తెలంగాణ (Telangana)లోని ఆర్టీసీ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కిందని విమర్శించింది. కార్మికులను రేవంత్ ప్రభుత్వం నిండా ముంచిందని ధ్వజమెత్తింది.

RTC Strike | న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె బాట పట్టినా:

ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ (BRS) మండిపడింది. ప్రస్తుతం కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె బాట పట్టినా, ప్రభుత్వం కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముందుకు రాకపోవడం దారుణమని పేర్కొంది. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపింది.

RTC Strike | మరో సకల జనుల సమ్మె:

కార్మికుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే రాష్ట్రంలో మరోసారి ‘సకల జనుల సమ్మె’ తరహా పోరాటం తప్పదని బీఆర్ఎస్ హెచ్చరించింది. కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని, ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేల్కొని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఈ మేరకు సోషల్ మీడియా (Social Media) వేదికగా ఘాటుగా స్పందించింది. కార్మికుల పక్షాన తాము అండగా ఉంటామని, వారి హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..: Hyderabad Water Supply | నల్లాకు మోటారు పెడుతున్నారా.. జలమండలి కఠిన చర్యలు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....