Fuel Prices | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తల్లో నిజం లేదు: కేంద్రం

Srinivas Kolluri

అక్షరటుడే, న్యూఢిల్లీ : Fuel Prices | దేశవ్యాప్తంగా వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్న ఇంధన ధరల పెంపు వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ (Union Ministry of Petroleum) స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని, ప్రభుత్వం అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది.

Fuel Prices | ధరలు పెంచని ఏకైక దేశం భారత్:

గత నాలుగేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని పెట్రోలియం శాఖ గుర్తు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌ (International market)లో రేట్లు పెరిగినప్పటికీ, దేశంలోని పౌరులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది.

Fuel Prices | పుకార్లను నమ్మవద్దు:

ముడిచమురు దిగుమతి వ్యయాలు పెరిగినా, ధరల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తోందని పేర్కొంది. సోషల్ మీడియా (Social Media)లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఇంధన ధరల విషయంలో ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి ధరల పెంపు ఆలోచనే లేదని చెప్పడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

ఇది కూడా చదవండి..: Election Polling | ఓటు హక్కు వినియోగించుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు.. భారీగా తరలి వస్తున్న ప్రజలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *