State Finance Commission | స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ ఛైర్మన్​ నియామకం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: State Finance Commission | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రెండో రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్​, సభ్యులను నియమించింది. ఈ మేరకు గవర్నర్ శివప్రతాప్​ శుక్లా ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్​గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా సూర్యాపేట జిల్లాకు చెందిన సంకేపల్లి సుధీర్​రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎండీ అసిఫ్​ అలీ, వికారాబాద్​ జిల్లాకు చెందిన రంగరాజ్​ నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. విధులు రాష్ట్ర ఆర్థిక సంఘం స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతం కావడానికి సూచనలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, ఫీజులను ఎలా పంపిణీ చేయాలని చెబుతుంది. స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం అందించే నిధులపై సూచనలు చేస్తుంది.

State Finance Commission | మరో సారి సభ్యుడిగా అవకాశం

కాగా గతంలో సైతం సిరిసిల్ల రాజయ్యను స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ ఛైర్మన్​గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవి కాలం 2026 ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో మరోసారి ఆయనను ఛైర్మన్​గా నియమించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన సంకేపల్లి సుధీర్‌ రెడ్డికి సైతం మరో సారి సభ్యుడిగా అవకాశం కల్పించింది.

ఇది కూడా చదవండి..: KTR Padayatra | ‘కారు’ గేరు ఎప్పుడు మార్చాలో తెలుసు.. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా : కేటీఆర్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *