అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponnam Prabhakar on SIR | ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఎల్వోలు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాలను ప్రతి ఒక్కరు నింపాలని సూచించారు.
మంత్రి పొన్నం (Minister Ponnam) సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్వోలు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాలు నింపి, ఓటరు జాబితాలో ఓటు గల్లంతు కాకుండా చూసుకోవాలన్నారు. బీఎల్వోలు, బీఎల్ఏలు ఓటరు సవరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫారాలను ఎలా నింపాలో వివరించాలన్నారు. అర్హులు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని సూచించారు.
Ponnam Prabhakar on SIR | సంక్షేమ పథకాల అమలు

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. హుస్నాబాద్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయన్నారు. అర్హత ఉన్న వారికి ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. కాలువల్లో భూమి పోయిన ప్రభుత్వానికి సహకరించాలని రైతులను కోరారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొన్నం