US Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ జిల్లా యువతి మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా (Nalgonda District)కు చెందిన యువతి మృతి చెందింది. నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన నవ్య షికాగోలో రూజ్ వెల్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది.

గ్రామానికి చెందిన శ్రీనివాస్​రెడ్డి కుమార్తె నవ్య రెండున్నరేళ్ల క్రితం ఎంఎస్​ చదవడానికి అమెరికా వెళ్లింది. అక్కడ చదువు పూర్తి అవడంతో పార్ట్​ టైం ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి కారులో పార్ట్ టైమ్ ఉద్యోగానికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన మరో కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో కూర్చోవడంతో నవ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

US Road Accident | విషాదఛాయలు

నవ్య మృతి విషయం తెలియడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె స్వగ్రామమైన చెరువుగట్టులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చదువు పూర్తి అవడంతో మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలుస్తుందనుకున్న కూతురు చనిపోవడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవ్య మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. 7 జిల్లాలకు రెడ్​ అలెర్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *