అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Municipal Transfers | తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రేడ్‌లకు చెందిన సుమారు 89 మంది మున్సిపల్ కమిషనర్లు, అధికారులు బదిలీ అయ్యారు.
మరికొందరు పోస్టింగ్ కోసం వేచి చూసే జాబితాలో చేరారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ & డైరెక్టర్ కార్యాలయం (640-A.C గార్డ్స్, హైదరాబాద్) నుంచి జాయింట్ డైరెక్టర్ టి.ఎస్.వి.ఎన్ త్రిల్లేశ్వర్ రావు ఎండార్స్‌మెంట్‌ను విడుదల చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 574 (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ), తేదీ: 29.05.2026 కు అనుగుణంగా మే 30, 2026న ఈ బదిలీల ఎండార్స్‌మెంట్ ఉత్తర్వులను (Endt.Roc.No.e973121/2026/A2) అధికారికంగా కమ్యూనికేట్ చేశారు.

Telangana Municipal Transfers | కీలక బదిలీల వివరాలు
బదిలీ అయిన వారిలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, సెలక్షన్ గ్రేడ్ కమిషనర్లు, గ్రేడ్-I, గ్రేడ్-II, గ్రేడ్-III కమిషనర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
Telangana Municipal Transfers | వెయిటింగ్ లిస్ట్‌లో పలువురు
బదిలీల ఉత్తర్వులలో అత్యధిక సంఖ్యలో అధికారులను తదుపరి పోస్టింగ్ కోసం వెయిటింగ్ (Waiting for posting) లిస్ట్‌లో ఉంచారు. ఇందులో గ్రేడ్-II, గ్రేడ్-III అధికారులతో పాటు పలువురు స్పెషల్ గ్రేడ్ కమిషనర్లు కూడా ఉన్నారు.
Telangana Municipal Transfers | మున్సిపల్ కార్పొరేషన్లలో మార్పులు
జీహెచ్ఎంసీ (GHMC), నిజామాబాద్, మల్కాజ్‌గిరి, మంచిర్యాల్, రామగుండం వంటి ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, అదనపు కమిషనర్ల స్థానాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.
Telangana Municipal Transfers | మెప్మా (MEPMA) అధికారుల బదిలీ
హన్మకొండ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ ఇ.జోనాతో పాటు కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర పీడీలు, డీపీఓల బదిలీలు జరిగాయి.
Telangana Municipal Transfers | పలు పురపాలక సంఘాలకు కొత్త కమిషనర్లు
భువనగిరి, తిరుమలగిరి, కల్లూరు, దుబ్బాక, తూప్రాన్, గజ్వేల్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, మడుచింతలపల్లి, మహబూబాబాద్, జడ్చర్ల, జనగాం, దోర్నకల్, ఆందోల్ జోగిపేట, తాండూరు, మరిపెడ, ఈజ, పరిగి, మోత్కూరు, ఎల్లందు, వనపర్తి, పరకాల, మధిర వంటి అనేక పురపాలక సంఘాల కమిషనర్లు / మేనేజర్లకు తాజా ఉత్తర్వుల ద్వారా స్థానచలనం కలిగింది. మరికొందరికి కొత్త బాధ్యతలు అప్పగించారు.
ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని, బదిలీ అయిన అధికారులు వెంటనే సంబంధిత స్థానాల్లో నివేదించాల్సి ఉంటుందని సమాచారం. బదిలీ అయిన 89 మంది అధికారుల జాబితాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత విభాగాలకు, మున్సిపాలిటీలకు పంపించారు.
Cyber Crime Inspector | రక్షకుడే భక్షకుడైతే సామాన్యులకు రక్షణ ఎక్కడ..?…
