అక్షరటుడే, వెబ్‌డెస్క్: Double Bed Room Houses | నిజామాబాద్ నగరంలోని 30వ డివిజన్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎట్టకేలకు లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం లక్కీ డ్రా ఏర్పాటు చేశారు.

Double Bed Room Houses | కార్పొరేటర్ల సమక్షంలో
ఈ కార్యక్రమానికి ఆర్డీవో రాజేందర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, నుడా ఛైర్మన్ కేశ వేణు, సౌత్ ఎమ్మార్వో శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్, రాకేష్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్ల సమక్షంలో ఈ లక్కీ డ్రా చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 394 ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



