MeeSeva Irregularities | ‘మీసేవ’లలో అక్రమాలు.. రంగంలోకి దిగిన విజిలెన్స్​ బృందాలు..

మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్​ అధికారులు రంగంలోకి దిగారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​ : MeeSeva Irregularities |  మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్​ అధికారులు (Vigilance Officers) రంగంలోకి దిగారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

MeeSeva Irregularities | సర్టిఫికెట్ల విషయంలో అవినీతి..

మీసేవ కేంద్రాల్లో సాధారణంగా ప్రజలు కళ్యాణలక్ష్మి, బర్త్ అండ్ డెత్, కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే చాలామందికి దరఖాస్తు చేసిన అనంతరం సర్టిఫికెట్ తీసుకునే విషయంలో ఎవరికి కలవాలి.. ఎక్కడ కలవాలనే సందిగ్ధంలో ఉంటారు. అలాగే కొన్నింటికి సరైన పత్రాలు వారి వద్ద ఉండవు. అయితే దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది మీసేవ సెంటర్ల నిర్వాహకులు తాము సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా విజిలెన్స్​ అధికారులకు సమాచారం అందింది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న మీసేవ సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఇచ్చిన సర్టిఫికెట్లు.. దరఖాస్తులు తదితర వివరాలను సేకరించినట్లు తెలిసింది.

MeeSeva Irregularities

ఇది కూడా చదవండి..: Nizamabad Jail Warder | జైలు వార్డర్​​ క్రిమినల్​ ప్లాన్​.. డబ్బు కోసం ఏకంగా ఖైదీతో బేరసారాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *