అక్షరటుడే, కామారెడ్డి: Student Welfare Facilities | విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందించేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా ప్రత్యేక అధికారిణి బి.విజయేంద్ర ఆదేశించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan)తో కలిసి శనివారం దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు.
Student Welfare Facilities | విద్యార్థులతో కలిసి భోజనం..
విద్యార్థినులతో కలిసి ప్రత్యేక అధికారిణి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం అధికారులు, విద్య, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలపై సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని, వర్షాకాలంలో దోమల బెడద దృష్ట్యా అందరూ దోమతెరలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూనిఫాం క్లాత్ అందిన వెంటనే కొలతలు తీసి కుట్టించి అందించాలని ఆదేశించారు. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఘటనలు గమనించిన వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. పోషకాహారం తీసుకోవాలని, ఆహారాన్ని వృథా చేయవద్దని విద్యార్థినులకు సూచించారు. ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రతి విద్యార్థి సరైన పోషకాహారం తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, మెరుగైన విద్యా వాతావరణం అందేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ఇది కూడా చదవండి..: Road Pothole Protest | రహదారిపై గుంతల్లో నాట్లు వేసి నిరసన