Road Pothole Protest | రహదారిపై గుంతల్లో నాట్లు వేసి నిరసన

బోధన్​ పట్టణంలోని 11వ వార్డులో బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్ : Road Pothole Protest | పట్టణంలోని 11వ వార్డులో బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాకాసిపేట్ అయ్యప్ప గుడి కమాన్- ఆటో స్టాండ్ మధ్యలో రహదారిపై వార్డు కౌన్సిలర్ కొల్లిపాక రేణుక బాలరాజ్ (Kollipaka Renuka Balaraj) ఆధ్వర్యంలో వరినాట్లు వేశారు

Road Pothole Protest | గుంతలమయంగా..

ఈ రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో కనీసం నడిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ కొల్లిపాక రేణుక బాలరాజ్ మాట్లాడుతూ.. ఈ దారిలో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయన్నారు. భారీ గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ (Bodhan) పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపికిషన్, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, గుంత గంగాధర్, రాజులదేవి పవన్ కుమార్, మాసిని వినోద్, హన్మాండ్లు చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, పార్టీ నాయకులు పప్పుల వేణు, కన్నె శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, గడ్డం శ్రీనివాస్, ఫణీంద్ర, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Revenue Tampering | కలెక్టర్​ సంచలన నిర్ణయం.. రికార్డ్​ అసిస్టెంట్​పై వేటు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *