ADE Bribery Arrest | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ

Srinivas Kolluri

అక్షరటుడే, మెదక్​ : ADE Bribery Arrest | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటూ భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. తాజాగా మెదక్​ జిల్లా నర్సాపూర్​లో లంచం తీసుకుంటూ విద్యుత్​ శాఖ ఏడీఈ రమణారెడ్డి ఏసీబీకి చిక్కాడు.

మెదక్ జిల్లా (Medak District) నర్సాపూర్ డివిజన్, ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE)గా ముద్దం రమణారెడ్డి పని చేస్తున్నాడు. ఓ వ్యక్తికి సంబంధించి రూ. 3,13,882 విలువ గల 11 వర్క్ బిల్లులను మెదక్ డివిజనల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఆపరేషన్స్‌కు పంపడం కోసం ఏడీఈ రూ.25 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా.. ఏడీఈ రమణారెడ్డి ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు.

ADE Bribery Arrest | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Road Funds | తెలంగాణకు మరిన్ని నిధులు ఇవ్వాలి : మంత్రి సీతక్క

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *