Indiramma Houses Progress | గరీబోళ్ల కోసం మాట్లాడడం కాంట్రవర్సీ అయితే రోజూ మాట్లడతా.. : ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses Progress | గరీబోళ్లు, ప్రజల కోసం మాట్లాడితే కాంట్రవర్సీ అయితే తాను ప్రతిరోజూ మాట్లాడతానని జుక్కల్ (jukkal) ఎమ్మెల్యే లక్ష్మీకాంతా రావు (MLA Lakshmikanth Rao) హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Indiramma Houses Progress | నియోజకవర్గంలో 473 ఇళ్లు..

నియోజకవర్గంలో 473 ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) ఫైనల్ స్టేజ్​లో ఉన్నాయని అధికారుల నివేదిక ప్రకారం పూర్తికావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రెండేళ్ల నుంచి 8.9 శాతం మాత్రమే పురోగతి ఉండడడంపై అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇంతలా నత్తనడకన సాగడానికి గల కారణాలు చెప్పాలన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడంలో అధికారులు విఫలం అవుతున్నారని తెలిపారు. త్వరలో పూర్తవుతాయని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని సూచించారు. సంబంధిత శాఖలో కో–ఆర్డినేషన్ లేదని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పక్కనే ఇసుక ఉంటే 50 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో చూడాలని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.

Indiramma Houses Progress | రెండేళ్లలో కేవలం 8.9 శాతం పురోగతి సాధిస్తే ఎలా..?

రెండేళ్లలో 8.9 శాతం పురోగతి సాధిస్తే మిగతా 90 శాతం పూర్తికావడానికి ఎన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు. ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్యల పరిష్కారం ప్రభుత్వం రూపొందించిన యాప్ లోనే ఉన్నాయని, వాటిని అధికారులు అర్థం చేసుకోవడం లేదన్నారు. మొబైల్ మీద కేటాయించే సమయంలో 2 శాతం యాప్ మీద కేటాయించాలన్నారు. తాను వచ్చేటప్పుడు ఒక మీడియా పర్సన్ ఇవాళ ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడుతున్నారా అని అడిగారని, గరీబోళ్లు, ప్రజల సమస్యలపై మాట్లాడితే కాంట్రవర్సీ అయితే తాను ప్రతిరోజూ కాంట్రవర్సీ మాట్లాడతానని తెలిపారు. గరీబోళ్లు ట్రాక్టర్ ఇసుక ఎక్కువ తెచ్చుకుంటే ఏమీ కాదని, దొంగలను మాత్రం వదలకూడదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుక తెచ్చుకుంటే వారిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవాలా..? కోర్టుల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో అధికారులు కమిట్మెంట్​తో పని చేయాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.

ఇది కూడా చదవండి: Cockroach Janata Party | సరిహద్దులు దాటి.. పాకిస్థాన్‌కూ పాకిన ‘బొద్దింక’ల ట్రెండ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *