POCSO Court PP | పొక్సో మహిళా కోర్టు ఇన్​ఛార్జి పీపీగా నర్సింహారెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: POCSO Court PP | పొక్సో కోర్టు, మహిళా కోర్టు ఇన్​ఛార్జి పీపీగా (public prosecutor) నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా కోర్టు (Nizamabad First Additional District Court) పీపీ జి నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్​ ఆఫ్​ ప్రాసిక్యూషన్స్(Director of Prosecutions)​ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

POCSO Court PP | రాష్ట్రవ్యాప్తంగా..

బీఆర్​ఎస్(BRS)​ ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన పీపీలను రాష్ట్రవ్యాప్తంగా తొలగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో ఇన్​ఛార్జి పీపీలుగా కొందరికి అవకాశం ఇచ్చారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నోటిఫికేషన్​ వేసి కొత్తవారిని నియమించనున్నారు.

ఈ సందర్భంగా మహిళా కోర్టు (Women’s Court) పీపీగా ఉన్న బంటు వసంత్​ను, పొక్సోకోర్టు (POCSO Court) పీపీగా ఉన్న ఎం రాజారెడ్డిని తొలగించారు. అలాగే ఆర్మూర్​లో(Armoor) పీపీగా ఉన్న ఖాందేశ్​ శ్రీనివాస్​ స్థానంలో నిజామాబాద్​కు చెందిన సీనియర్​ సివిల్​కోర్టు పీపీఆర్​ఎస్​ఎల్​ గౌడ్​కు ఇన్​ఛార్జి పీపీగా నియమించారు.

ఈ సందర్భంగా నర్సింహారెడ్డి, ఎల్​ఎస్​ గౌడ్​ల నియామకం పట్ల మాజీ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, రెంజర్ల సురేష్​, రాజు, గణేష్​ తదితరులు అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Telangana PRC | పీఆర్సీపై త్వరలో నిర్ణయం : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *