అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు మృతి చెందాయి. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని అడ్లూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
Kamareddy Train Accident | అడ్లూర్ గ్రామానికి చెందిన..
గ్రామానికి చెందిన కుర్మ ఆరెల్లి లక్ష్మి తన గొర్రెల మందను తీసుకుని ప్రతిరోజు మాదిరిగానే గ్రామ శివారులో మేపడానికి వెళ్లింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ (Nizamabad) వైపు వెళ్తున్న రైలు డ్రైవర్ గొర్లను చూసి హారన్ కొట్టాడు. దీంతో బెదిరిన సుమారు 19 గొర్లు రైలు కింద పడి మృతి చెందాయి. దీంతో బాధిత రైతుకు సుమారు రూ.లక్షన్నర వరకు ఆస్తి నష్టం కలిగింది. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
ఇది కూడా చదవండి..: Grain procurement issues | అన్నదాత ఆక్రోషం.. రోడ్డుపై ధాన్యం బస్తాలు తగలబెట్టి నిరసన