నిజామాబాద్Kamareddy Railway Court | కవితకు షాక్​ ఇచ్చిన రైల్వే కోర్టు.. విచారణకు రావాలని ఆదేశం..

Kamareddy Railway Court | కవితకు షాక్​ ఇచ్చిన రైల్వే కోర్టు.. విచారణకు రావాలని ఆదేశం..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డిలో రైల్ రోకోకు దిగిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు షాకిచ్చింది.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Railway Court | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డిలో రైల్ రోకోకు దిగిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు రైల్వే కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.

Kamareddy Railway Court | నవంబర్​ 28న కామారెడ్డిలో..

కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలో గతేడాది నవంబర్ 28న బీసీ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం ఆగదని ఆమె హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితతో పాటు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ రైల్ రోకో కారణంగా సిర్నపల్లి-ఇందల్వాయి మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఓ గూడ్స్ రైలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి రైల్వే ఏఎస్సై రవీంద్ర బాబు (Kamareddy Railway ASI Ravindra Babu) ఫిర్యాదు మేరకు కవితతో సహా 12 మంది టీఆర్ఎస్ నేతలపై రైల్వే చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

Kamareddy Railway Court

ఇది కూడా చదవండి..: NEET Exam Cancellation | ‘నీట్’ రద్దు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే..: బొబ్బిలి రామకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tanuja Murder Case| ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనుషుల విషయంలో పోలీసుల కీలక హెచ్చరిక

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tanuja Murder Case|హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజా...

Nizamabad Child Death | నిజామాబాద్‌లో విషాదం..వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Child Death | తల్లిదండ్రులు తమ తమ...

Kamareddy District Court | గంధపు చెట్లపై ఆశతో భూ యజమాని హత్య.. కౌలురైతుకు జీవిత ఖైదు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy District Court | ఆస్తిపై ఆశతో కౌలు...

ONGC Share Price | రాయల్టీ రేట్ తగ్గించిన కేంద్రం.. పరుగులు తీసిన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ONGC Share Price |భారతదేశంలో అప్‌స్ట్రీమ్ అన్వేషణ,...