అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rakesh Reddy Self Goal | రాజకీయాల్లో నోటి దూకుడు ఒక్కోసారి సొంత వికెట్ Wicket పడేలా చేస్తుంది. ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని వేసిన ప్లాన్ తిరగబడి, తలప్రాణం తోకకు వచ్చేలా చేస్తుంది. సరిగ్గా ఇదే సీన్ ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గంలో రిపీట్ అయింది.
స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి mla rakesh reddy చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఎక్కుపెట్టాయి. కాంగ్రెస్ congress ప్రభుత్వం స్కూటీలు ఇవ్వడం లేదంటూ, “కాంగ్రెస్ నేతల షోరూంల నుంచి స్కూటర్లు ఎత్తుకెళ్లాలి” అని ఆయన పిలుపునివ్వడం కాస్తా… ఇప్పుడు ఆయన సొంత హామీల మెడకు చుట్టుకుంది.
రైట్… మీరు మా షోరూంలపై పడితే, మేము మీ ఇంటి ఎదుట తేల్చుకుంటాం అంటూ కాంగ్రెస్ పార్టీ సరికొత్త “రివర్స్ గేర్” పొలిటికల్ డ్రామాకు తెరలేపింది. సోమవారం ఉదయం 10 గంటలకు “ఛలో అంకాపూర్” కు పిలుపునిస్తూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
CBSE 10th Results | CBSE 10వ తరగతి రెండో బోర్డు పరీక్షల ఫలితాలు విడుదల.. DigiLockerలో రిజల్ట్స్
Rakesh Reddy Self Goal | ‘ఛలో అంకాపూర్’ సారాంశం..
గ్రామానికి 15 ఇండ్లు ఏవి సార్?: ఎన్నికల ప్రచారంలో గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, సొంత డబ్బులతో ప్రతి గ్రామానికి 10 నుంచి 15 ఇండ్లు కట్టిస్తానని రాకేశ్ రెడ్డి హామీ ఇచ్చారట. మరి ఆ ఇండ్లు ఏవి? ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అంతా కలిసి ఆ సొంత డబ్బుల ఇండ్ల లెక్క తేల్చడానికి రావాలని పిలుపునిచ్చారు.
రూపాయి వైద్యం.. ముక్కోటి ముచ్చటా?: సీఎంఆర్ఎఫ్ (CMRF), ఎల్పీ (Letter of Credit)ల విషయంలో “రూపాయికే వైద్యం” అంటూ మోసం చేశారనే కోపంతో ఉన్న లబ్ధిదారులు కూడా ఈ నిరసనలో పాల్గొనాలని కోరారు.
జనసమీకరణ: ప్రతి గ్రామం నుంచి బాధితులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసన ర్యాలీని సక్సెస్ చేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

Rakesh Reddy Self Goal | సెల్ఫ్ గోల్.. అంటే ఇదేనా బాస్?
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఎమ్మెల్యే, ప్రత్యర్థి పార్టీని కార్నర్ చేద్దామని భావించి, ఉద్వేగంలో కాస్త రూట్ తప్పారు. షోరూంల నుంచి స్కూటర్లు ఎత్తుకెళ్లాలనే వ్యాఖ్యలు చట్టపరంగా, రాజకీయంగా ఆయనకే మైనస్ అయ్యాయి.
దీన్ని సరిగ్గా వాడుకున్న హస్తం పార్టీ నేతలు.. “మీరు కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే ముందు, మీ సొంత డబ్బులతో కట్టిస్తానన్న ఇండ్ల సంగతి ఏంటి?” అంటూ రివర్స్ ఎటాక్ ప్రారంభించారు.
Rakesh Reddy Self Goal | హీటెక్కుతున్న ఆర్మూర్ పాలిటిక్స్
మొత్తానికి కాంగ్రెస్ నేతలు వేసిన ఈ రివర్స్ ప్లాన్ ఆర్మూర్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఈ పిలుపుతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. సోమవారం జరగబోయే “ఛలో అంకాపూర్” ర్యాలీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఈ సెల్ఫ్ గోల్ నుంచి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఎలా డిఫెన్స్ చేసుకుంటారో చూడాలి మరి!