అక్షరటుడే, కామారెడ్డి: Illegal Liquor Sales | కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, మెస్‌లు, దాబాలపై శనివారం ఎక్సైజ్ (Excise Raids) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో డిగ్రీ కాలేజీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ మెస్‌ను తనిఖీ చేశారు.
Illegal Liquor Sales |అనుమతి లేకుండా విక్రయాలు..
Messలో అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్, మెస్ నిర్వహిస్తున్న దిలీప్ రెడ్డిపై కేసు(Kamareddy Police) నమోదు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని ఏ హోటల్, మెస్ లేదా దాబాలో అనుమతి లేకుండా మద్యం అమ్మినా, తాగడానికి అనుమతించినా కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ హెచ్చరించారు.
అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. ఈ దాడుల్లో ఎస్సై విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఫరీద్, కానిస్టేబుల్స్ రాజు, దినేష్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: CBSE 10th Results | CBSE 10వ తరగతి రెండో బోర్డు పరీక్షల ఫలితాలు విడుదల.. DigiLockerలో రిజల్ట్స్