Malaria Awareness | ఎల్లారెడ్డిలో ప్రపంచ మలేరియా డే అవగాహన ర్యాలీ

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Malaria Awareness | ప్రపంచ మలేరియా డేను పురస్కరించుకొని శనివారం ఎల్లారెడ్డి (Yellareddy)లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మత్మల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

Malaria Awareness | నేటి తొలక పురుగులే.. రేపటి పెద్ద దోమలు..

కమ్యూనిటీ ఆస్పత్రి (Community Hospital) నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో అధికారులు, సిబ్బంది ప్లకార్డులతో పాల్గొన్నారు. ‘నేటి తొలక పురుగులే రేపటి పెద్ద దోమలు’, ‘దోమలు పుట్టకుండా చేసుకుందాం – దోమలు కుట్టకుండా చూసుకుందాం’, ‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’, ‘పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత’ వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పి నర్సింగ్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, మత్మల్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ శరత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఠాకూర్, ఆరోగ్య విస్తరణ అధికారులు పాశం గోవిందరెడ్డి, జనార్ధన్ రెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు రాణి, రాజేశ్వరితో పాటు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని డాక్టర్​ నర్సింగ్ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Constable Harassment | కానిస్టేబుల్​ వేధింపులతో యువకుడి సూసైడ్​.. వెలుగులోకి సెల్ఫీ వీడియో..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *