అక్షరటుడే, వెబ్‌డెస్క్:Constable Harassment | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని హమల్వాడి డోల అనిల్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. యువకుడు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది.
ఇందులో సదరు యువకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఓ యువతితో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ (Woman Constable) మానసిక వేధింపులకు గురి చేశారని పేర్కొన్నాడు. ‘నాపై, నా కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని కానిస్టేబుల్ బెదిరించారు. నన్ను ఇష్టం వచ్చినట్లు దూషించారు. నన్ను జైలులో పెడతామన్నారు. నువ్వు చావు లేదంటే మేమే చంపేస్తాం. నా మేన మరదలు ఎంగేజ్మెంట్ అయింది. అయినా కూడా నన్ను వదలడం లేదు’ అంటూ వీడియో వాపోయాడు.

Constable Harassment | పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
సెల్ఫీ వీడియో (Selfie Video) వెలుగులోకి రావడంతో యువకుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యువకుడి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడికి ఎలాంటి ఇతర బాధలు లేవని తెలిపారు. ఓ యువతితో పాటు కానిస్టేబుల్ తీవ్రంగా వేధించారని తెలిపాడు. తన కుమారుడికి మేన మరదలితో ఎంగేజ్మెంట్ చేశామని వివరించాడు. కానీ యువతి తన కుమారుడి ఇబ్బంది పెట్టిందని.. అలాగే కానిస్టేబుల్ సైతం బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Yellareddy Municipality | మాట తప్పని కౌన్సిలర్.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న సిద్ధి శ్రీధర్ గుప్తా


[…] ఇది కూడా చదవండి : Constable Harassment | కానిస్టేబుల్ వేధింపులతో యు… […]