అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Constable Pramod | విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ సతీమణికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు గురువారం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) నియామక ఉత్తర్వులను ప్రణితకు అందజేశారు.
Constable Pramod | విధి నిర్వహణలో..
విధి నిర్వహణలో భాగంగా నిందితుడి దాడిలో కానిస్టేబుల్ (Nizamabad Police) ప్రమోద్ మృతి చెందాడు. దీంతో అమరవీరుల కుటుంబాలను ఆదుకునే చర్యల్లో భాగంగా.. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రణీతకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ.. పోలీస్ శాఖ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! బంగారం ధరలు పడిపోయాయ్..