అక్షరటుడే, డిచ్పల్లి: Minister Seethakka Visit | జిల్లాలో ఈనెల 4న మంత్రి సీతక్క (Minister Seethakka) పర్యటించనున్నారు. ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లిలో నూతనంగా నిర్మించిన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ప్రారంభించనున్నారు.
Minister Seethakka Visit | లోటుపాట్లు లేకుండా..
ఇందల్వాయి మండలం తిర్మన్పల్లిలో రూ.5 కోట్లతో బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నిర్మించారు. మంత్రి సీతక్క ఈ జూనియర్ కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సాయ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు చింతల కిషన్(ఇందల్వాయి), అంబర్ సింగ్(డిచ్ పల్లి), నాయకులు నరేష్, రాంచందర్ గౌడ్, సంజయ్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Ventures | అక్రమ వెంచర్లకు మున్సిపల్ అధికారుల చెక్.. జేసీబీలతో కూల్చివేతలు