అక్షరటుడే, లింగంపేట: MLA Madan Mohan | ఎల్లారెడ్డి (Yellareddy) ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై (MLA Madan Mohan Rao) అసత్య ఆరోపణలు, అవాస్తవాలతో పత్రికల్లో వస్తున్న వార్తలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. లింగంపేట (Lingampet) లో శనివారం వారు మాట్లాడారు.
MLA Madan Mohan | అవాస్తలు రాయడం సరికాదు..
అసత్య సమాచారం, అవాస్తవ వ్యాఖ్యలు ప్రచురించడం సరికాదని నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు స్వాగతిస్తున్న సమయంలో కావాలనే రాజకీయ దురుద్దేశాలతో ఓ పత్రికలో ఇలాంటి కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేస్తూ ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్‌పై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.
ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులు..
డబ్బులు ఇవ్వలేదనే కారణంతో కొందరు కావాలనే అసత్య వార్తలు ప్రచురిస్తున్నారని నాయకులు ఆరోపించారు. వారికి ఎల్లారెడ్డిలో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపించకపోవడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత దినపత్రిక యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెంటనే స్పందించకపోతే సోమవారం కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, యువ నాయకులు పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు సంకూర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bandhi Sanjay Case | ప్రధాని మోడీ ప్రోగ్రాం నుంచి బండి పేరు తొలగింపు.. మెడకు చుట్టుకున్న కొడుకు కీచక వ్యవహారం!

