Elderly Parents Harassment | కన్నకొడుకే హింసిస్తున్నాడు.. కాపాడాలని తల్లిదండ్రుల వినతి

తమ కన్నకొడుకే మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు. ఈ మేరకు ప్రజావాణిలో నిజామాబాద్​ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Elderly Parents Harassment | తమ కన్నకొడుకే తమను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు. నిజామాబాద్​ నగరంలోని కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​కు వారు తమ కొడుకుపై ఫిర్యాదు చేశారు.

Elderly Parents Harassment | చంపాలని చూస్తున్నాడు..

ఈ సందర్భంగా తల్లిదండ్రులు కొండ్లెపు చిన్న బాలయ్య, రాధ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని.. రెండో కొడుకు కొండ్లెపు శంకర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వేల్పూర్ మండలం (Velpur Mandal) పడిగెల్​ గ్రామంలో పనిచేస్తున్నాడన్నారు. కొన్ని రోజులుగా తమను మానసికంగా వేధిస్తున్నాడని.. తమకు మాయమాటలు చెప్పి తమ ఇంటిని శంకర్ వదిన కొండ్లెపు విజయ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడన్నారు. అలాగే రూ.6.5లక్షలను శంకర్​ దగ్గర గతంలో ఉంచామని.. ఇప్పుడు ఆ డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడన్నారు.

Elderly Parents Harassment | బంధించి.. చిత్రహింసలకు గురిచేసి..

ఇటీవల మా ఇద్దరిని బంధించి చిత్రహింసలకు గురి చేశాడని వృద్ధ దంపతులు వాపోయారు. డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఈ విషయమై మార్చి 16న సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అప్పటినుంచి ‘నా పైనే ఫిర్యాదు చేస్తారా.. మీ అంతు చూస్తా’నంటూ మమ్మల్ని మరింతగా వేధిస్తున్నాడని.. చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు రోదిస్తూ వివరించారు. చిన్నప్పుడు కూలి పనులు చేస్తూ కష్టపడే చదివించామని.. ప్రభుత్వ ఉద్యోగిగా తీర్చిదిద్దితే నేడు మమ్మల్ని చంపడానికైనా సిద్ధమయ్యాడని వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని.. న్యాయం చేయాలని వారు కలెక్టర్​ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ వేల్పూర్ పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి..: Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *