Government School Education | ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: డీఈవో అశోక్​

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Government School Education | ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య (government school education) అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ (DEO Ashok) అన్నారు. నగరంలోని బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో (Borgam (P)ZPHS) విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Government School Education | సర్కారు స్కూళ్లలో అన్ని సౌకర్యాలు..

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. నాణ్యమైన చదువు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం (Mid-Day Meals), పుస్తకాలు, దుస్తులు ఇలా అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నాయన్నారు. అనంతరం మండల స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటి సాధనకు ముందుకు కదలాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలన్నారు.

borg

Government School Education | పాఠశాలకు పూర్తి సహకారం..

కార్పొరేటర్ యాదాల నరేష్ మాట్లాడుతూ బోర్గాం(పి) ఉన్నత పాఠశాలకు జిల్లాలోనే (Nizamabad) మంచి పేరు ఉందన్నారు. ఇక్కడ వెయ్యిమందికి పైగా విద్యార్థులు చదువుకోవడం గొప్ప విషయమన్నారు. పాఠశాలకు అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు, విద్యాస్థితి, వివిధ అంశాల్లో పాఠశాల చేపట్టిన కార్యక్రమాలను ఆడియో, వీడియో రూపంలో హెచ్​ఎం శంకర్ తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్​లో (Food Festival) వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కో–ఆప్షన్ మెంబర్ అశోక్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు జమున, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

schi1

scool

ఇది కూడా చదవండి: Stock Market Rally | వాల్యూ బయ్యింగ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *