నిజామాబాద్Bhujanga Rao Nizamabad | నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా వి. భుజంగరావు నియామకం

Bhujanga Rao Nizamabad | నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా వి. భుజంగరావు నియామకం

స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (SGDC) కేడర్‌కు చెందిన వి. భుజంగరావును నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bhujanga Rao Nizamabad | నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు – Local Bodies) గా వి. భుజంగరావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

Bhujanga Rao Nizamabad | స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కేడర్‌

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న అడిషనల్ కలెక్టర్ పోస్టులో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (SGDC) కేడర్‌కు చెందిన వి. భుజంగరావును నియమిస్తూ సాధారణ పరిపాలన (SPL-A) శాఖ శుక్రవారం (మే 22, 2026న) జీవో నంబర్ G.O.Rt.No.715 ద్వారా ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర గవర్నర్ పేరిట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) కె. రామకృష్ణ రావు ఈ బదిలీ, నియామక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రతిని సంబంధిత అధికారికి, జిల్లా కలెక్టర్‌కు, ట్రెజరీ కార్యాలయానికి సమాచారం నిమిత్తం పంపినట్లు నివేదికలో పేర్కొన్నారు.

జిల్లాలోని స్థానిక సంస్థల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను, పరిపాలనను ఈ కొత్త నియామకం మరింత వేగవంతం చేయనుందని భావిస్తున్నారు.

BC Leader Targeted | కులాధిపత్య మీడియా ‘కుట్రల’ బట్టబయలు: బీసీ బిడ్డ ఉన్నత పదవిపై ‘రెడ్డి గారి ఛానెల్’ విషప్రచారం!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chinthala Pati Madhu | మూడు ముక్కలుగా నరికి.. గోనె సంచిలో కుక్కి .. బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chinthala Pati Madhu | సూర్యాపేట Suryapet జిల్లా...

May 23 Gold Rates | మూడు రోజుల ర్యాలీకి బ్రేక్.. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. పీక్స్‌లోనే వెండి!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 23 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న...

Petrol Diesel Price Hike | ముచ్చటగా మూడోసారి వడ్డన.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Petrol Diesel Price Hike | సామాన్యుడిపై ఇంధన...

May 23 Horoscope | వ్యాపారంలో ఊహించని ధన లాభాలు.. ఇవాళ ఈ రాశుల వారికి తిరుగులేదు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 23 Horoscope | గ్రహాల అనుకూలత వల్ల ఈ...