అక్షరటుడే, భీమ్‌గల్: Steel Bank Bheemgal | భీమ్‌గల్‌ను ప్లాస్టిక్‌రహిత మండలం దిశగా తీర్చిదిద్దేందుకు ముందడుగు పడింది. ప్లాస్టిక్ రహిత పట్టణ నిర్మాణమే లక్ష్యంగా భీంగల్ (Bheemgal) పురపాలక సంఘం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Steel Bank Bheemgal | స్టీల్ బ్యాంక్ ప్రారంభించిన ఛైర్పర్సన్
పట్టణంలోని 9వ వార్డులో శ్రీ వైష్ణవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ‘ఇందిర మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘స్టీల్ బ్యాంక్’ను మున్సిపల్ ఛైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి మంగళవారం ప్రారంభించారు. ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని, దీనిని నివారించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల స్థానంలో స్టీల్ పాత్రలను వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని.. ఇందిర మహిళా శక్తి ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఈ స్టీల్ బ్యాంక్‌ను ప్రజలు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలు, ఇతర వేడుకలకు వినియోగించుకోవాలని సూచించారు.
Steel Bank Bheemgal | ప్లాస్టిక్ రహిత సమాజం కోసం

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఛైర్పర్సన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ చంటి లత నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ గజానంద్, కౌన్సిలర్లు ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, పర్స కుశలత అనంతరావు, తోట సతీష్, గున్నాల బాలలక్ష్మీ భగత్, బోదిరే లావణ్య నర్సయ్య, అంజుమ్ ఆలీ, సందీప్, నీలం రవి, సంగ్యా నాయక్, మల్లెల అనుపమ ప్రసాద్, మేనేజర్ నరేందర్, ఏడీఎంసీ నందన్ రెడ్డి, మెప్మా సిబ్బంది, పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇందిర మహిళా శక్తి సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Medical Workers Salaries | జీజీహెచ్, మెడికల్ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ధర్నా