అక్షరటుడే, ఇందూరు: Medical Workers Salaries | జీజీహెచ్, మెడికల్ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య పేర్కొన్నారు. నగరంలోని మెడికల్ కళాశాల ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం ఏడీ రమాదేవికి వినతిపత్రం అందజేశారు.
Medical Workers Salaries | కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి
ఓమయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందికి సంబంధించిన వేతన సవరణ ఒప్పందం కాల పరిమితి ముగిసి సంవత్సరం అవుతోందన్నారు. ఇప్పటికీ వేతనాలు పెరగకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. వెంటనే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం కార్మికులపై పనిభారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, అర్జీత సెలవులు ఇవ్వాలని ఈనెల 9న కోటిలోని డీఎంఈ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నామన్నారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె నిర్వహించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్, యూనియన్ కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు కవిత, స్వరూప, భారతి, కవిత, వెంకటేష్, మరియు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Enumeration Process Kamareddy | ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగడం లేదు : బీఆర్ఎస్ ఆరోపణ