Multiple Voter Registration | ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండడం నేరం: జిల్లాలో ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి

ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండడం, తప్పుడు సమాచారం ఇవ్వడం శిక్షార్హమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Multiple Voter Registration | ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఓటర్ల జాబితాలో (Voter List) ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండడం, తప్పుడు సమాచారం ఇవ్వడం శిక్షార్హమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సూచించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

Multiple Voter Registration | చట్టంలోని సెక్షన్​ 17 ప్రకారం..

చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకుంటే చట్టపరంగా అనర్హుడని కలెక్టర్​ పేర్కొన్నారు. సెక్షన్ 31 ప్రకారం ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల నమోదు లేదా తొలగింపుల సమయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే తీవ్రమైన నేరంగా పరిగణించ బడుతుందన్నారు. అటువంటి వారికి ఏడాది వరకు జైలుశిక్ష, లేదా జరిమానా.. లేదా ఈ రెండూ విధించబడతాయని తెలిపారు. ఓటర్లందరూ ఈ చట్టపరమైన నిబంధనలను విధిగా పాటించాలని, ఎవరికైనా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు లేదా వేర్వేరు ప్రాంతాలలో ఓట్లు ఉన్నట్లయితే, వెంటనే ఫారమ్-7 (Form-7) ద్వారా అదనపు ఓట్లను తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

vote

ఇది కూడా చదవండి : #Hyderabad | ఉప్పర్​పల్లి బార్బీక్యూ నేషన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *