MP Arvind | శాస్త్రీయ పరిజ్ఞాన విద్యకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎంపీ అర్వింద్​

గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : MP Arvind | గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ​(Dharmapuri Arvind) పేర్కొన్నారు. గురువారం ఆలూరు (Alur) మండలం దేగాం గ్రామంలోని జడ్పీహెచ్​ఎస్​లో ఆధునిక సైన్స్ ల్యాబ్‌ను (Science Lab) ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

MP Arvind | విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని..

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఏడబ్ల్యూబీ (60:40) పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.13.50 లక్షల వ్యయంతో ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు ఎంపీ తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ఇలాంటి ల్యాబ్‌లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు కూడా పోటీ ప్రపంచంలో రాణించే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. విద్యార్థులు సైన్స్ ల్యాబ్‌ను (Science Education) సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

mpt

ఇది కూడా చదవండి : కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది ‘బిగ్ బాస్’ డ్రామా: బండి సంజయ్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *