Bathroom Bucket Vastu | స్నానం చేశాక బకెట్లో నీళ్లు ఉంచాలని అంటారు.. దీనికి కారణం తెలుసా?

మన నిత్య జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన ఇంటి ఆర్థిక పరిస్థితిని, కుటుంబ సభ్యుల అదృష్టాన్ని శాసిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bathroom Bucket Vastu | మన నిత్య జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన ఇంటి ఆర్థిక పరిస్థితిని, కుటుంబ సభ్యుల అదృష్టాన్ని శాసిస్తాయని వాస్తు శాస్త్ర ( Vastu Shastra )నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో ఒకటి.. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్‌లోని బకెట్‌ను ఖాళీగా వదిలేయడం. చాలామంది స్నానం ముగియగానే బకెట్‌ను పూర్తిగా వంపేసి ఖాళీగా ఉంచుతారు. కానీ, శాస్త్రాల ప్రకారం స్నానం పూర్తయ్యాక బకెట్‌లో కొన్ని నీళ్లు ఉంచాలని, ఖాళీగా వదలకూడదని అంటున్నారు. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Bathroom Bucket Vastu | ఖాళీ బకెట్ దరిద్రానికి సంకేతమా?

వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్రూమ్‌లో ఖాళీ బకెట్‌ను నిటారుగా ఉంచడం అస్సలు మంచిది కాదు. ఖాళీ పాత్రలు లేదా ఖాళీ బకెట్ అనేది ఇంట్లో ఆర్థిక లోటును, దరిద్రాన్ని సూచిస్తుంది. దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) ప్రవేశించి, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, ఫలితంగా అనవసరపు ఖర్చులు పెరిగి అప్పులపాలయ్యే ప్రమాదం ఉందని నమ్ముతారు.

bukket.1

Bathroom Bucket Vastu | బకెట్‌లో నీళ్లు ఎందుకు ఉంచాలి?

స్నానం పూర్తయిన తర్వాత బకెట్‌ను పూర్తిగా ఖాళీ చేయకుండా, అందులో కనీసం సగం వరకు లేదా కొన్ని స్వచ్ఛమైన నీళ్లను నింపి ఉంచాలి. ఇలా నీటితో నిండిన బకెట్ ఉండటం వల్ల ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుందని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ప్రతీతి.జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నీరు చంద్రుడికి, రాహు-కేతువుల ప్రభావానికి ముడిపడి ఉంటుంది. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచి, బకెట్‌లో నీళ్లు ఉంచడం వల్ల జాతకంలో చంద్రుడి బలం పెరుగుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతారు.

Bathroom Bucket Vastu | ఈ తప్పులు అస్సలు చేయకండి..

బకెట్ బోర్లించడం: ఒకవేళ బకెట్‌లో నీళ్లు ఉంచడం ఇష్టం లేకపోతే, ఆ బకెట్‌ను బోర్లించి (తలకిందులుగా) పెట్టాలి కానీ, ఖాళీగా నిటారుగా వదిలేయకూడదు. స్నానం చేసిన మురికి నీటిని బకెట్‌లో అలాగే ఉంచకూడదు. పాత నీటిని పారబోసి, మళ్లీ కొన్ని మంచి నీళ్లను పట్టి ఉంచాలి. వాస్తు ప్రకారం బాత్రూమ్‌లో బ్లూ కలర్ (నీలం రంగు) బకెట్ వాడటం వల్ల రాహు దోషాలు తొలగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  MP Arvind | శాస్త్రీయ పరిజ్ఞాన విద్యకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎంపీ అర్వింద్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *