Police vehicle checking | పోలీసుల వాహనాల​ తనిఖీలు.. తప్పించుకునే క్రమంలో కారుబోల్తా

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ: Police vehicle checking | పోలీసులు వాహనాలు​ తనిఖీలు (police checking) చేస్తుండగా తప్పించుకునే క్రమంలో కారుబోల్తా పడింది. ఈ ఘటన బాల్కొండ (balkonda) మండలంలోని బోధపల్లి వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Police vehicle checking | వాహనాలు తనిఖీ చేస్తుండగా..

బాల్కొండ పోలీసులు (Balkonda Police) తెలిపిన వివరాల ప్రకారం.. బోధపల్లి వద్ద మంగళవారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు డ్రైవర్​ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా డ్రైవ్​ చేయగా.. అదుపు తప్పి బోల్తాపడింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ స్కూటీని సైతం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్​ తెలిపారు.

ఇది కూడా చదవండి: High Court holidays | మే 7 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *