అక్షరటుడే, డిచ్‌పల్లి: Solar Power Plant | నిజామాబాద్ టీజీ ఎన్పీడీసీఎల్ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. డిచ్‌పల్లి (Dichpally) డివిజన్ పరిధిలోని జక్రాన్‌పల్లి (Jakranpalli)లో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు పూర్తి కావడంతో విద్యుత్ సరఫరా ప్రారంభించింది.
Solar Power Plant | పరిశీలించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ
ఈ సందర్భంగా నిజామాబాద్ సర్కిల్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) ద్వారా స్థాపించబడిన తొలి సౌర విద్యుత్ ప్లాంట్‌ను సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. డిచ్‌పల్లి డివిజన్ పరిధిలోని 33/11 కేవీ జక్రాన్‌పల్లి సబ్‌స్టేషన్‌లో 0.8 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 0.8 మెగావాట్ (ఏసీ) సామర్థ్యం ఉన్న గ్రౌండ్ మౌంటెడ్ సౌర ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ప్లాంట్ ఏప్రిల్ 11న సాంకేతికంగా ఛార్జ్ చేసి, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామన్నారు. నిరంతర విద్యుత్ ఉత్పత్తి కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సుమారు 4,000 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి సైతం జరుగుతోందన్నారు.
Solar Power Plant | అత్యవసర పరిస్థితుల్లో పట్టణ ఫీడర్లకు విద్యుత్..
అత్యవసర పరిస్థితుల్లో పట్టణ ఫీడర్లకు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుందని, కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని ఈ సందర్భంగా సీఎండీ పేర్కొన్నారు. విద్యుత్ గ్రిడ్‌కు సుమారు 43 యాంప్లిఫైర్ల లోడ్ ఇంజెక్ట్ చేస్తున్నామన్నారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచుతూ, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి టీజీ ఎన్పీడీసీఎల్ ముందడుగు వేస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఆపరేషన్స్ పీవీ రాజేశ్వరరావు, డీఈలు వెంకటరమణ, హరిచంద్, ఏడీఈలు తోట రాజశేఖర్, ఆర్.బాలేష్ కుమార్, కె.నటరాజ్, బాలచందర్ ఏఈలు ప్రవీణ్ కుమార్, ఏ.కాశీనాథ్, సాయిలు, భవిత, ఎంఆర్‌టీ, ఆపరేషన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Wedding Car Accident | కాసేపట్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులకు గాయాలు


[…] […]