అక్షరటుడే, మెండోరా: Mendora Auto Accident | అదుపుతప్పిన ఆటో బోల్తా పడగా ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ముప్కాల్ నుంచి మెండోరా (Mendora) వెళ్తుండగా చోటు చేసుకుంది.
Mendora Auto Accident | ప్యాసింజర్ ఆటో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ముప్కాల్ (Mendora) నుంచి మెండోరా వైపు ప్యాసింజర్లతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కోడిచర్ల గ్రామానికి చెందిన వేల్పూర్ దేవాయ్ అనే మహిళ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆటోను ముప్కాల్ గ్రామానికి చెందిన సాయికుమార్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.
ఇది కూడా చదవండి: JPSC Recruitment Scam | ఉద్యోగ నియామకాల కుంభకోణం.. జార్ఖండ్‌లో మాజీ చైర్మన్ అరెస్టు