Annabhau Sathe | పేదల గొంతుకగా అన్నాభావు సాఠే : ఎమ్మెల్యే ధన్​పాల్

పేదల గొంతుకగా అన్నాభావు సాఠే నిలిచారని నిజామాబాద్​ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Annabhau Sathe | పేదల గొంతుకగా అన్నాభావు సాఠే నిలిచారని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Annabhau Sathe | మాతంగ్​ సమాజంలో..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాతంగ్ సమాజంలో పుట్టిన అన్నాభావు చిన్నప్పటినుంచి కుల వివక్షను ఎదుర్కొన్నారన్నారు. మిల్లులో పనిచేస్తూ వీధిదీపాల కింద కూర్చొని చదివి గొప్ప రచయిత కవిగా ఎదిగారని గుర్తు చేశారు. సుమారు 35 పుస్తకాలను రాసి ఆదర్శంగా నిలిచారన్నారు. కేవలం రచనలు చేయడమే కాకుండా మహారాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. జై భీమ్ జై భారత్ అనే నినాదంతో అంబేడ్కర్​ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. ప్రధానంగా చదువు ఒక్కటే ఆయుధమని కులం పేరుతో ఎవరిని చిన్నచూపు చూడొద్దని పేర్కొన్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, బంటు ప్రీతి ప్రవీణ్, అన్నా భావు సాఠే సమాజ్ కమిటీ అధ్యక్షుడు గంగాధర్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: National Highway Safety | జాతీయ రహదారులపై భద్రతా చర్యలపై పోలీసుల అవగాహన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *