అక్షరటుడే వెబ్డెస్క్: NEET Protest Parliament | నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయ సభలను అడ్డుకుంటున్నాయి. ఈ పరిణామాలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju ) స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల నిరసనలు, పోలీసు చర్యలపై లోక్సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర హోంమంత్రి స్వయంగా దీనిపై సమాధానం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు.
NEET Protest Parliament | ప్రతిపక్షాలకు కిరణ్ రిజిజు విజ్ఞప్తి..
మీడియాతో మాట్లాడిన కిరణ్ రిజిజు.. ‘‘విద్యార్థుల నిరసనలపై సమగ్ర చర్చతోపాటు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర హోంమంత్రి దీనిపై స్పందిస్తారు. అయితే.. చర్చ జరిగే సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి అంతరాయం కలిగించకూడదు. హోంమంత్రి ప్రకటనకు ఆటంకం సృష్టించకుండా, ఆయన ఇచ్చే సమాధానాన్ని పూర్తిగా వినాలి. చర్చ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని’’ కోరారు.
NEET Protest Parliament | కొనసాగుతున్న ప్రతిష్టంభన..
గత జులై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాల నిరసనల కారణంగా పదేపదే వాయిదా పడుతున్నాయి. మొదట నీట్ పేపర్ లీక్, అయోధ్య రామ మందిర విరాళాల అవకతవకలపై ఆందోళన చేపట్టిన విపక్షాలు.. ప్రస్తుతం నీట్ నిరసనకారులపై పోలీసుల తీరును ప్రధానాస్త్రంగా మలుచుకున్నాయి. ఈ అంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి సభకు వచ్చి స్పష్టమైన ప్రకటనలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Molbio Diagnostics IPO | డయాగ్నోస్టిక్స్ కంపెనీ ఐపీవో ప్రారంభం