అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bay of Bengal Boat Tragedy | బంగాళాఖాతంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 500 మందికి పైగా మయన్మార్ (Myanmar) దేశానికి చెందిన వలసదారులు (రోహింగ్యా శరణార్థులు) ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్ర తీరం నుంచి బయలుదేరిన రెండు పడవలు సముద్రంలో మునిగిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
Bay of Bengal Boat Tragedy | ప్రమాదం ఎలా జరిగింది?
జూన్ చివరలో రాఖైన్ తీరం నుంచి ఈ రెండు పడవలు ప్రయాణాన్ని ప్రారంభించాయి. వీటిలో మయన్మార్ నుంచి వస్తున్న రోహింగ్యాలతో పాటు, బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. మొదటి పడవలో దాదాపు 250 మందితో ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ పడవ, బయలుదేరిన కొద్దిసేపటికే అధికారులతో సంబంధాలను కోల్పోయింది. రెండవ పడవలోసుమారు 280 మంది ప్రయాణికులతో వెళ్తున్న జులై 8న అయేయార్వాడీ తీరంలో మునిగిపోయింది.
Bay of Bengal Boat Tragedy | అంతర్జాతీయ సంస్థల ఆవేదన..
ఈ ఘటనపై అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) , యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ (UNHCR) సంయుక్తంగా స్పందించాయి. ప్రాథమిక దర్యాప్తు నివేదికల ప్రకారం, రెండు పడవల్లో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఈ సంస్థలు అంచనా వేశాయి. సముద్ర ప్రయాణాల్లో శరణార్థులు ఇటువంటి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని, ఇది తీవ్ర మానవతా సంక్షోభమని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి..: NEET Paper Leak | రూ. 5 లక్షలకు 111 ప్రశ్నలు.. నీట్ లీక్‌లో సంచలన నిజాలు