Fuel Price Hike | ప్రజలు ముందుకు సాగాలంటే సైకిలే మార్గం : అఖిలేష్​ యాదవ్

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fuel Price Hike | పెట్రోలు ధరల పెంపుపై సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రజలు ముందుకు సాగాలంటే సైకిలే మార్గం అంటూ పోస్ట్ చేశారు. సైకిల్ కన్నా ఉత్తమమైనది ఏదీ లేదని ముందే చెప్పామని పేర్కొన్నారు. కాగా యూపీలో ఎస్పీ గుర్తు సైకిల్ కావడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం (Central Government) శుక్రవారం ఉదయం పెట్రోల్​, డీజిల్, సీఎన్​జీ ధరలను పెంచిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. లీటర్​కు రూ.3 మేర ధరలు పెరిగాయి. ధరల పెరుగుదలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలు అయిపోగానే కేంద్రం ప్రజలపై భారం మోపడం మొదలు పెట్టిందని విమర్శిస్తున్నాయి. ఇంధన రేట్ల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.

Fuel Price Hike | రానున్నది కష్టకాలం

దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతోంది. పాల ధరల నుంచి మొదలు పెడితే అనేక పదార్థాల ధరలు పెరిగాయి. వంట నూనె, పప్పులు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇంధన ధరలు పెరగడంతో ఆ ప్రభావం ప్రజలపై పడనుంది. సరుకు రవాణా వ్యయం పెరగనుండటంతో కంపెనీలు వస్తువుల రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై అదనపు భారం పడనుంది. మరోవైపు ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతాయని పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ప్రభుత్వాలు స్పందించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: NEET Online Exam | వచ్చే ఏడాది నుంచి ఆన్​లైన్​లో ‘నీట్’ పరీక్ష

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *