NEET Online Exam | వచ్చే ఏడాది నుంచి ఆన్​లైన్​లో ‘నీట్’ పరీక్ష

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Online Exam | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్​లైన్​ విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ (Minister Dharmendra Pradhan) ప్రకటించారు.

దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్​ యూజీ పరీక్ష (NEET UG Exam) ప్రశ్న పత్రాలు లీక్​ అయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్​టీఏ పరీక్షను రద్దు చేసింది. జూన్​ 21న రీ ఎగ్జామ్ పెడుతామని తెలిపింది. అయితే పేపర్​ లీకేజీలు అవుతుండటంతో సీబీటీ విధానంలో పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి శుక్రవారం తెలిపారు. నీట్​ పేపర్​ లీకేజీ స్పందిస్తూ.. నిందితులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. పేపర్​ లీకేజీకి మూల కారణం ఆఫ్​లైన్​లో పరీక్ష నిర్వహించడమని చెప్పారు.

NEET Online Exam | వెంటనే విచారణ చేపట్టాం

పరీక్ష జరిగిన కొద్దిసేపటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NTA) ఒక ఫిర్యాదు అందిందని మంత్రి తెలిపారు. దానిపై వెంటనే విచారణ ప్రారంభించామని చెప్పారు. గెస్ పేపర్ ముసుగులో, అసలైన పరీక్షా ప్రశ్నలే లీక్ అయ్యాయని నిర్ధారణ కావడంతో పరీక్షను రద్దు చేసినట్లు తెలిపారు. మోసపూరిత అభ్యర్థుల కుట్రలు, విద్యా మాఫియా పన్నే పన్నాగాలతో అర్హత కలిగిన విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టామన్నారు.

NEET Online Exam | తప్పుడు ప్రచారం వ్యాప్తి

వివిధ సోషల్ మీడియా (Social Media) ఖాతాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించామన్నారు. ఈసారి ఎటువంటి అక్రమాలు జరగనివ్వం అన్నారు. అభ్యర్థుల పరిస్థితి చూసి తమకు బాధగా ఉందని, అయితే ప్రయోజనాల దృష్ట్యా పరీక్ష రద్దు చేశామని వెల్లడించారు.

NEET Online Exam | అక్కడే లీక్​

ప్రస్తుతం ఆఫ్​లైన్​ విధానంలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రశ్నపత్రాలను ప్రింటింగ్​ చేస్తున్నారు. ఈ బాధ్యతను ఎన్​టీఏ ఇతరులకు అప్పగిస్తుంది. అయితే ప్రశ్న పత్రం ప్రింటింగ్​ సమయంలో లీక్​ అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

ఇది కూడా చదవండి..: Telangana ANM Results | ఏఎన్​ఎం పరీక్ష ఫలితాలు విడుదల

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *