అక్షరటుడే, వెబ్డెస్క్: Arvind Dharmapuri | ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2026పై ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలో నిజామాబాద్ Nizamabad ఎంపీ అర్వింద్ ధర్మపురి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం లోక్సభ విడుదల చేసిన అధికారిక బులెటిన్లో జాయింట్ కమిటీ సభ్యుల జాబితాలో అర్వింద్ ధర్మపురి పేరు నమోదైంది.
ఈ జాయింట్ కమిటీలో లోక్సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులు ఉన్నారు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2026కు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలించి, సభ్యుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోనుంది.
Arvind Dharmapuri | సమగ్రంగా చర్చిస్తా..
కమిటీలో సభ్యుడిగా నియమితులైన సందర్భంగా అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు.
దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత, పారదర్శకత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బిల్లుపై జాయింట్ కమిటీలో సమగ్రంగా చర్చిస్తానని అర్వింద్ ధర్మపురి తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానన్నారు.
నిజామాబాద్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్లమెంటులో ప్రజా సమస్యలతో పాటు దేశ ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంపై మరింత బాధ్యతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.