Cyber Crime Drug Control | సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణకు ప్రజలు సహకరించాలి..: సీపీ సాయిచైతన్య

సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణకు ప్రజలు సహకరించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Cyber Crime Drug Control | సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణకు ప్రజలు సహకరించాలని సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) పేర్కొన్నారు. బోధన్ రూరల్ (Bodhan Rural) పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయలో ‘మన ఊరు మన భద్రత మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా 15 సీసీ కెమెరాలను ప్రారంభించారు.

Cyber Crime Drug Control | సీసీ కెమెరాల 100మంది పోలీసులతో సమానం..

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Cyber Crime Drug Control | డ్రగ్స్​ నివారణకు కృషి చేయాలి..

ఈ సందర్భంగా పెగడపల్లి గ్రామాలలో డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్త లు తీసుకోవాలని సీపీ సూచించారు. 2025లో జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో 340 మంది చనిపోగా అందులో 200 మంది గ్రామస్థాయిలో జరిగిన రోడ్డు ప్రమాదాల వలన మరణించడం జరిగిందని తెలిపారు. తదుపరి విద్యార్థినిలు గ్రామంలో గల మహిళలు మరియు డ్వాక్రా గ్రూపు మహిళలతో మాట్లాడి వారి బాగోగుల గురించి చర్చించారు.

విద్యార్థులు ఎలాంటి ఆకర్షణలకు గురికాకుండా ఇంట్లో తల్లిదండ్రులకు అన్ని రకాలుగా సహకరిస్తూ విద్యను చక్కగా అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రూరల్ ఎస్సై రాజశేఖర్, సర్పంచ్ రచన సుదర్శన్, షాలిమార్ ఆచరిస్ మేనేజర్ ఇమ్రాన్ ముళ్ల, గ్రామ వైస్ ప్రెసిడెంట్ పోతు రెడ్డి, ఉపసర్పంచ్ ఎండీ షబ్బీర్, విలేజ్ కమిటీ ప్రెసిడెంట్ సాయిబాబు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 ఇది కూడా చదవండి: Raghav Chadha Voter List | రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్..  ఓటర్ జాబితాలో పేరు గల్లంతు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *