అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Wall Collapse | పొట్టకూటి కోసం కూలీ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో(Nizamabad) బుధవారం చోటు చేసుకుంది.
Nizamabad Wall Collapse | నాల్గో టౌన్ పరిధిలో..
నగరంలోని నాల్గో టౌన్ పరిధిలోని వినాయక్‌నగర్‌లో ఓ ఇంటిపై ఉన్న గోడను కూల్చివేసేందుకు బోధన్ నుంచి వచ్చిన అడ్డా కూలీ వెళ్లాడు. అయితే గోడను కూలగొట్టే క్రమంలో అకస్మాత్తుగా అది అతడిపై పడింది. దీంతో అక్కడికక్కడే సదరు కూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఎస్సై సాయన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Kavitha Ricky Radhan Meeting | కవిత ఇంట్లో విజయ్ జ్యోతిష్యుడు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!