RTC staff attack police | పోలీసులపై దాడి.. ఆర్టీసీ సిబ్బందిపై కేసు నమోదు

Naresh Chandan
RTC JAC Talks | ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు

అక్షరటుడే, కామారెడ్డి: RTC staff attack police | ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపారు.RTC Bus Protest

RTC staff attack police | సామాన్య ప్రజలను అడ్డుకుంటూ..

కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ప్రవీణ్ రెడ్డి, మధు, శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది ఉన్నారని సీఐ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయటికి వెళ్లే దారిలో వాహనాలు, సామాన్య ప్రజల రాకపోకలను ఆర్టీసీ సిబ్బంది ఆటంకపర్చుతున్నారని చెప్పారు.

దీంతో వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పగా.. పోలీసుల మీద దాడి చేశారని సీఐ వివరించారు. ఈ విషయమై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ కండక్టర్ పరమేశ్​తో పాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

RTC staff attack police | కఠిన చర్యలు తప్పవు

ఎవరైనా దాడులకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ స్పష్టం చేశారు. పోలీసులపై దాడి విషయమై ఆర్టీసీ కండక్టర్ పరమేశ్​ మీద చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ రీజనల్ మేనేజర్​కు నివేదిక పంపించినట్లు వివరించారు.

ఇది  కూడా చదవండి: Indian Woman Speech | ‘మతాన్ని మార్చం.. మనసులను గెలుస్తాం!’ టెక్సాస్ కౌన్సిల్ హాల్‌లో ప్రతిధ్వనించిన భారతీయ గళం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *