Electric Shock Death | నగరంలో విషాదం.. విద్యుత్​ షాక్​లో మేస్త్రి దుర్మరణం

నగరంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్​ షాక్​తో ఓ మేస్త్రి మృత్యువాత పడ్డాడు.

shashi kiran Mottala
Electric Shock | విద్యుదాఘాతంతో రైతు మృతి..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Electric Shock Death | నగరంలో(Nizamabad) విషాదం చోటు చేసుకుంది. విద్యుత్​ షాక్​తో ఓ మేస్త్రి మృత్యువాత పడ్డాడు.

Electric Shock Death | బోర్గాం(పి)లోని..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బోర్గాం(పి)లోని ఓ కమర్షియల్​ బిల్డింగ్​లో లిఫ్ట్​ నిర్మాణానికి సంబంధించి అహ్మద్​ మిశ్రా అనే గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గుత్తేదారు ఇద్దరు మేస్త్రీలు కిరణ్​(30), దీపక్​ అనే ఇద్దరిని పనికి పంపాడు. అయితే గురువారం వీరు లిఫ్ట్​ పనులు చేస్తున్న క్రమంలో ఇనుప రాడ్డు పక్కనే ఉన్న 33/11 కేవీ వైర్లకు తగిలింది. ఈ ప్రమాదంలో కిరణ్​, దీపక్​లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిరువురిని స్థానిక ప్రగతి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే కిరణ్​ మృతి చెందాడు. దీపక్​ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరు కూడా నాందేడ్​ జిల్లాకు చెందిన వారు.  పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ స్టేడియం(MCG)లోని శక్తి భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను నిర్వచిస్తుంది.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *