Urea App Awareness | అక్రమ రవాణాను అడ్డుకునేందుకే యూరియా యాప్

రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని.. అక్రమ రవాణాను అరికట్టేందుకే యాప్​ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Urea App Awareness | రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఎప్పటికీ చేయదని.. అక్రమ రవాణాను అరికట్టేందుకే యాప్​ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. ఖిల్లా డిచ్​పల్లిలో ప్యాక్స్​ (PACS) ఆధ్వర్యంలో రైతులకు యూరియాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Urea App Awareness | దగ్గరుండి యూరియా యాప్​లో బుక్​ చేయించి..

ఈ సందర్భంగా సొసైటీలో సొసైటీలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్​లో రైతుతో దగ్గరుండి బుకింగ్ చేయించారు. అనంతరం యాప్​లో తలెత్తే సమస్యలను అడిగి తెలుసుకొని రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రం విధించే కోతల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన స్థాయిలో యూరియా నిల్వలు రాలేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన యూరియా నిల్వలను అందరూ రైతులకు పొదుపుగా పంపిణీ జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు.

ఈ నేపథ్యంలో యాప్​లో అక్కడక్కడ సాంకేతిక కారణాల వల్ల రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల సమస్యల విని.. భరోసా కల్పించేందుకే ఇక్కడికి వచ్చానని, ఒకవేళ చిత్తశుద్ధి లేకుంటే వచ్చేవాళ్లమే కాదన్నారు. సొసైటీ పరిధిలోని 4 గ్రామాల రైతువేదికల నుంచి యూరియా పంపిణీ జరుగుతుందని సొసైటీ ఛైర్మన్ రాంచందర్ గౌడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఐడీసీఎంఎస్ ఛైర్మన్లు మునిపల్లి సాయరెడ్డి, తారాచంద్, పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, వాసు, ధర్మాగౌడ్, అంబర్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి..: Power Supply | నిరంతర విద్యుత్​ సరఫరాలకు ట్రాన్స్​కో హైపవర్​ ప్లాన్​..: ఎస్​ఈ పీవీ రాజేశ్వర్​రావు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *