Police Duty Obstruction | తప్పతాగి పోలీసు విధులకు ఆటంకం.. నలుగురిపై కేసు నమోదు

ఖిల్లా ఛౌరస్తాలో బుధవారం రాత్రి కానిస్టేబుల్​ విజయ్​ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన బరాత్​లో కొందరు యువకులు తప్పతాగి కానిస్టేబుల్​పై దురుసుగా ప్రవర్తించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Police Duty Obstruction | తమ విధులకు ఆటంకం కలిగించిన ఆకతాయిలపై పోలీసులు కొరఢా ఝలిపించారు. బరాత్​లో తప్పతాగి పోలీసు కానిస్టేబుల్​పై తిరగబడిన నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్​ Nizamabad జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

Police Duty Obstruction | బరాత్​లో హంగామా

ఐదో ఠాణా ఎస్​హెచ్​వో సునీల్​ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖిల్లా ఛౌరస్తాలో బుధవారం రాత్రి కానిస్టేబుల్​ విజయ్​ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన బరాత్​లో కొందరు యువకులు తప్పతాగి కానిస్టేబుల్​పై దురుసుగా ప్రవర్తించారు.

కానిస్టేబుల్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు Police దర్యాప్తు చేపట్టారు. నిందితులను దండు సాయిలు, దండు సృజన్, దండు శివ, అనితగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్​కు తరలించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *