TJA Foundation Day | జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యం: టీజేఏ

జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యంగా టీజేఏ పని చేస్తోందని సంఘం అధ్యక్షుడు సాయి ప్రసాద్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: TJA Foundation Day | జర్నలిస్టుల హక్కులు సాధించడం, సామాజిక సేవే లక్ష్యంగా టీజేఏ పని చేస్తోందని సంఘం అధ్యక్షుడు సాయి ప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (TJA) 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నగరంలోని స్నేహ సొసైటీలో గురువారం ఘనంగా నిర్వహించారు.

TJA Foundation Day | విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ

స్నేహ సొసైటీలో విద్యార్థులకు బిస్కెట్లు, ఇతర వస్తువులను టీజేఏ నిజామాబాద్ (Nizamabad) ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం సంఘం అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC) సభ్యుడు G. సాయి ప్రసాద్ మాట్లాడుతూ టీ జే ఏ (TJA) ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. రమణారావు, ప్రధాన కార్యదర్శి ఘోరిల నాయకత్వంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు సాగుతున్నాయని తెలిపారు. హక్కుల పోరాటంతో పాటు టీజేఏ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

అనంతరం స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ టీజేఏ ఆవిర్భావ దినోత్సవాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, రోగులకు పండ్ల పంపిణీ, విద్యార్థులకు నోట్‌బుక్స్, ఆహార పదార్థాల వితరణ వంటి సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. జర్నలిస్టుల వృత్తిగత భద్రత, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం వారు చేస్తున్న పోరాటాలు జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజేఏ ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, శ్రీనివాస్ రెడ్డి, యశస్వి, మురళి కృష్ణ, వికాస్ గైక్వాడ్, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Road Safety Telangana | తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట : ఎంపీ అర్వింద్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *