అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Agriculture College | వ్యవసాయ కళాశాలను జక్రాన్‌పల్లి (jakranpally) మండలంలో ఏర్పాటు చేయాలని సర్పంచ్ల ఫోరం (Sarpanches Forum) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Agriculture College | జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరుపై హర్షం
ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Jayashankar Telangana Agricultural University) రాజేంద్రనగర్‌కు అనుబంధంగా నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో 800 ఎకరాలకు పైగా సారవంతమైన ఎర్ర నేల, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జాతీయ రహదారికి అతి సమీపంలో కళాశాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలం ఉందని వారు విన్నవించారు.
Agriculture College | దేశంలోనే జక్రాన్‌పల్లికి ప్రత్యేకస్థానం..
వ్యవసాయ కళాశాలను జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే జక్రాన్‌పల్లి మండలంలోని రైతులు ఎంతోమంది అభ్యుదయ అధునాతన వ్యవసాయ విధానాలను అవలంభిస్తూ వాణిజ్య పంటలైన పసుపు, ఎర్రజొన్న, సజ్జలను పండిస్తూ దేశంలోనే ప్రత్యేకంగా నిలిచారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాలను జక్రాన్‌పల్లిలోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Kavita Farmers Support | మొక్కజొన్న దగ్ధమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత

