Kavita Farmers Support | మొక్కజొన్న దగ్ధమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavita Farmers Support | ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) బోథ్ మండలంలోని కనుగుట్టలో ప్రమాదవశాత్తు వంద ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట కాలిపోవడంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

పంట దహనమై నష్టపోయిన రైతులతో హైదరాబాద్ నుంచి ఫోన్​లో మాట్లాడి ఓదార్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ మౌనికతో కలిసి బాధిత రైతులతో ఫోన్ లో మాట్లాడారు.కనుగుట్టలో ఇటీవల మంటలు వ్యాపించి మొక్కజొన్న పంట దగ్ధమైన విషయం తెలిసిందే. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో ఆ రైతులు గుండెలవిసేలా రోధించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం సైతం స్పందించారు. తాజాగా కవిత మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. పంట నష్టం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా ఒత్తిడి చేస్తామని భరోసా ఇచ్చారు.

Kavita Farmers Support | సాయం చేయాలి

ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న పంట దహనమై నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కవిత డిమాండ్​ చేశారు. పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి..: KTR Allegations | మా కెమెరాలు, ఫోన్లు హ్యాక్​ చేస్తున్నారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *